Breaking News
Home / States / Andhra Pradesh / టీటీడీ చైర్మన్ తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం…

టీటీడీ చైర్మన్ తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం…

గుంటూరు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీరుపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి నివాసంలో నెల్లూరు పంచాయితి ఎలా నిర్వహిస్తారు?, ఒక దేవాలయానికి ఛైర్మన్‌‌గా ఉన్న వ్యక్తికి రాజకీయ పంచాయితి చేయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.  శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరించిందని ఆరోపించారు. సీఎం జగన్‌కు నైతిక విలువలు ఉంటే శ్రీధర్‌రెడ్డిని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులపై వైసీపీతో చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. సీఎం వస్తే చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. మా తప్పు ఉంటే క్షమాపణ చెబుతామని ప్రకటించారు.

Check Also

పూర్ణాహుతితో ముగియనున్న చండీయాగం….

Share this on WhatsAppఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సహస్త్ర చండీ యాగం పూర్ణాహుతితో గురువారంతో ముగుస్తుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *