Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సీఎంని ప్రశ్నించిన వర్ల రామయ్య….

సీఎంని ప్రశ్నించిన వర్ల రామయ్య….

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చారా? లేదా? అనేది టీటీడీ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ మతం ప్రకారం ఇస్తే భార్యతో కలసి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. సొంత బాబాయ్ చనిపోయి ఏడాది కాకముందే జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు ఎలా సమర్పిస్తారు? అని నిలదీశారు. ఇక మూల నక్షత్రం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి కానీ ఈరోజే సీఎం ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. రేపు ప్రధాని మోదీని ఏమి అడగబోతున్నారో సీఎం ముందుగానే చెప్పాలని కోరారు. సొంత కేసుల గురించి ప్రధానితో మాట్లాడతారా? లేక ప్రజల గురించి మాట్లాడతారా? అనేది ముందే చెప్పాలన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *