Breaking News
Home / National / రాపిడ్‌టెస్టు కిట్ల దిగుమతిపై వెంకయ్య స్పందన

రాపిడ్‌టెస్టు కిట్ల దిగుమతిపై వెంకయ్య స్పందన

ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణ కోసం ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం సంతోషకరమన్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఆంధ్రప్రదేశ్‌ దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కిట్ల ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. వీటి ద్వారా రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటడం మంచి పరిణామం అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *