Breaking News
Home / States / వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు…

వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు…

హైదరాబాద్‌ : ఎన్నికల్లో ధర ప్రవాహాన్ని ఆపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వచ్చి చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరుణంలో మారాల్సింది వ్యవస్థ కాదని… ప్రజలే మారాలని ఆయన అన్నారు. నేతలు ఓట్లు కొంటున్నారని… ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నేతలు కోట్లు ఖర్చు పెడుతున్నారని… గెలవగానే అవినీతి చేస్తారని అన్నారు. ఎన్నికల ముందు అన్నీ ఫ్రీ అంటారని… గెలిచాక చేతులెత్తేస్తారని వెంకయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు సభలకే కోట్లు ఖర్చు పెడుతున్నారని… పార్టీలు సభలు పెట్టేందుకు మూడు బి లు పాటిస్తున్నాయని అన్నారు.మూడు బి లు అంటే బీరు, బిర్యానీ, బేటా అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన మనీ పవన్ ఇన్ ఎలక్షన్స్‌పై జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *