Breaking News
Home / Film News / ఈ సిరీస్‌లో ఎప్పటికైనా ఆయనతో చేస్తా…

ఈ సిరీస్‌లో ఎప్పటికైనా ఆయనతో చేస్తా…

ఫిల్మ్ న్యూస్: హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కి భారీ విజయం సాధించిన చిత్రం ‘రాజుగారి గది’. దర్శకనిర్మాత ఓంకార్ రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించడంతో ఈ సిరీస్‌లో మరో రెండు సినిమాలు వచ్చాయి. రెండో చిత్రంలో ‘కింగ్’ నాగార్జున, సమంత కూడా నటించారు. తాజాగా ఈ రోజు మూడో సినిమా విడుదలైంది. ఈ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు వస్తాయని, ఎప్పటికైనా వెంకటేష్‌గారితో ఈ సిరీస్‌లో ఒక చిత్రం చేస్తానని ఓంకార్ వెల్లడించారు.

‘నిజానికి `రాజుగారిగది-2` చిత్రాన్ని వెంకటేష్‌గారితోనే ప్లాన్ చేశాను. కానీ, కొన్ని కారణాల వల్ల నాగార్జునగారితో చేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా ఈ సిరీస్‌లో వెంకటేష్‌గారితో ఒక సినిమా చేస్తాను. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేన’ని ఓంకార్ చెప్పారు. మరి, హారర్ కామెడీ టైపు చిత్రాన్ని చేయడానికి వెంకటేష్ ఒప్పుకుంటారో, లేదో చూడాలి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *