Breaking News
Home / Film News / ‘వెంకీ మామ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల…

‘వెంకీ మామ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల…

ఫిల్మ్ న్యూస్: విజయ దశమి సందర్భంగా ‘వెంకీ మామ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. వెంకటేశ్‌, నాగచైతన్య నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రీకరణ దశలో ఉంది. పాయల్ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టైటిల్‌ను బట్టే ఇది మామా అల్లుళ్ల మధ్య నడిచే కథ అని అర్థమవుతుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లపై వీరిద్దరూ ఇప్పుడు వెండితెరపై కూడా అదే పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే గోదావరి తీరంలో పచ్చని పంట పొలాల మధ్యన ఉండే పల్లెటూరు కథ. మిలటరీ నుండి పల్లెటూరులోని మామయ్య చూడటానికి వచ్చిన మేనల్లుడి మధ్య నడిచే కథ అని అర్థమవుతుంది. ‘గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా.. ఇప్పుడు జాతరలో వేట నేర్పుతా..రారా అల్లుడు’ అని పపర్‌ఫుల్ డైలాగ్‌తో ‘వెంకీమామ’ ఫస్ట్ గ్లింప్స్ ఉంది. ఇందులోనే మామ, అల్లుడు మధ్య అనుబంధం, ఇద్దరూ కలిసి విలన్స్ భరతం పట్టే యాక్షన్ సన్నివేశాన్ని కూడా చూడొచ్చు. ఈ గ్లింప్స్ కలర్‌ఫుల్‌గా ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *