Breaking News
Home / Film News / రైతు పాత్రలో నటించనున్న వెంకీ….

రైతు పాత్రలో నటించనున్న వెంకీ….

ఫిల్మ్ న్యూస్: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వైవిద్య పాత్రలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్టార్డమ్ కానీ హోదా కానీ చూడకుండా పాత్ర డిమాండ్ చేస్తే యువహీరోలతో కూడా కలిసి నటించే స్వభావమున్న హీరో వెంకీ. అలాంటి వెంకీ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో నేటి తరం హీరోలతో పోటి పడుతూ మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. వెంకీ తదుపరి చిత్రం రైతుకు సంబంధించింది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన అసురన్ చిత్రం రీమేక్ లో వెంకీ నటించబోతున్నట్లు సమాచారం.

ఇందులో వెంకీ రైతు పాత్రలో కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్ థాసు కలిసి తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సురేష్ బాబు చెబుతున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *