Breaking News
Home / Film News / యాక్షన్‌ సన్నివేశాల్లో వెన్నెల కిషోర్…

యాక్షన్‌ సన్నివేశాల్లో వెన్నెల కిషోర్…

హైదరాబాద్‌: మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో టాలీవుడ్‌ నటుడు వెన్నెల కిషోర్‌ నటిస్తున్న చిత్రం ‘వి’. నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్నది ఈ చిత్రం. ఇటీవల ఈ సినిమా థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొన్నారట. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌మీడియా వేదికగా సుధీర్‌బాబు అభిమానులతో పంచుకున్నారు. ”వి’ షూటింగ్ గ్యాలరీలోని ఈ వీడియో ఫుకేట్‌ షెడ్యూల్‌లో చిత్రీకరించింది. వెన్నెల కిషోర్‌ని యాక్షన్‌ స్వీక్వెన్స్‌ కోసం సిద్ధం చేస్తున్నాం.’ అని సుధీర్‌ పేర్కొన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *