Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వర్మకు సినిమా పేరు ఎలా పెట్టాలో తెలియదు : జేసీ

వర్మకు సినిమా పేరు ఎలా పెట్టాలో తెలియదు : జేసీ

అమరావతి: ఆర్జీవీ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. రాంగోపాల్‌ వర్మకు సినిమా పేరు పెట్టడం తెలియదని.. అసలా సినిమాకు ‘రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం’ అని పేరు పెట్టాల్సిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో బుధవారం మీడియాతో సరదాగా మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. జగన్ హయాంలో తాత రాజారెడ్డి మార్క్‌ పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని.. నామినేటెడ్‌ పోస్టులు రెడ్లకు ఇచ్చినందుకు జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా జగన్‌ గట్స్‌ను మెచ్చుకుంటున్నానని.. అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని విమర్శించారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారని.. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. డబ్బులు లేవుగా అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తు చేశారు. నెల్లూరులో మాఫియాలు ఉన్నాయని ఆనం అనకుండా ఉండాల్సిందన్నారు. ఎక్కడ మాఫియా లేదో చెప్పమనండంటూ ఎదురు ప్రశ్న వేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *