Breaking News
Home / States / Andhra Pradesh / వర్మను దేశ బహిష్కరణ చేయాలి : క్రీడా సంఘం

వర్మను దేశ బహిష్కరణ చేయాలి : క్రీడా సంఘం

తిరుపతి: వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం `అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌ బిడ్డ‌లు` సినిమా ప్రదర్శన వద్ద క్రీడా సంఘం నిరసన తెలిపింది. కులాల మధ్య అన్యోన్యతను దెబ్బ తీసి, ఘర్షణకు కారణమౌతుందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వర్మను దేశ బహిష్కరణ చేయాలని క్రీడా సంఘం డిమాండ్ చేసింది. `అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌ బిడ్డ‌లు` సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఎట్ట‌కేల‌కు గురువారం విడుద‌ల‌ అయింది. తెలంగాణ హైకోర్టు విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత సినిమా విడుద‌లపై రివ్యూ క‌మిటీ, సెన్సార్ బోర్డు నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఒక ప‌క్క హైకోర్టు ఆదేశాలు.. మ‌రోప‌క్క రివ్యూ క‌మిటీ నిర్ణ‌యాన్ని ప‌రిశీలించిన సెన్సార్ బోర్డు సినిమాకు `యు/ఎ` స‌ర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో సినిమా విడుద‌ల‌కు మార్గాలు సుగ‌మ‌మయ్యాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *