Breaking News
Home / Lifestyle / Recipes / ఎంతో సులువుగా.. రుచిగా.. `ఎగ్ కట్‌లెట్`

ఎంతో సులువుగా.. రుచిగా.. `ఎగ్ కట్‌లెట్`

కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన గుడ్లు- నాలుగు, ఉడికించిన బంగాళాదుంపలు- నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు,

కొత్తిమీర- అరకప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, గుడ్లు-రెండు, బ్రెడ్‌పొడి- కప్పున్నర, నూనె- సరిపడినంత, పచ్చిమిర్చి- రెండు, పసుపు- స్పూను,
కారం- స్పూను, గరంమసాలా- స్పూను, ధనియాల పొడి- రెండు స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి వేయించాలి. ఈ లోపు ఉడికించిన గుడ్లను ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను కూడా పొట్టుతీసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేయాలి. అందులో చిదిమిన బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి.

ఇప్పుడు చేతికి నూనె రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ముద్ద తీసుకుని కాస్త వెడల్పుగా చేసి దీంట్లో గుడ్డు ముక్కను పెట్టి మూసేయాలి. ఇలా మిగిలినవీ చేసుకుని.. వీటిని గిలకొట్టి పెట్టుకున్న గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి. తర్వాత వాటిని వేడి నూనెలో వేసి గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే ఎంతో సులువుగా ఎగ్ కట్‌లెట్స్ రెడీ..!

Check Also

గుమ్మడి కాయ కూర

Share this on WhatsAppకావలసిన పదార్థాలు బూడిద గుమ్మడి – అరకేజీ ముక్క, పచ్చికొబ్బరి తురుము – అరకప్పు, ఆవాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *