‘వేణువై వచ్చాను భువనానికీ’ అంటూ తెలుగు సినీ సాహిత్యంపై వేటూరి సుందరరామ్మూర్తి వేసిన ముద్ర నభూతో నభవిష్యత్. తెలుగు పాటల చిరునామా వేటూరి ‘ఓ సీతకథ’తో కెరీర్ మొదలుపెట్టారు. ‘రాలిపోయే పువ్వా’ అంటూ శ్రోతలను కంటతడి పెట్టించడంతో పాటు జాతీయ అవార్డు అందుకున్నారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అంటూ యువతను ఉర్రూతలుగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే.
– ఇవాళ వేటూరి జయంతి
