Breaking News
Home / Politics / హుజూర్ నగర్ ఎన్నికలపై వీహెచ్ వ్యాఖ్యలు…

హుజూర్ నగర్ ఎన్నికలపై వీహెచ్ వ్యాఖ్యలు…

హైదరాబాద్‌: హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు డిసైడ్‌ అయ్యారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. అయినా ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పార్టీ పోలీసుల సాయంతో డబ్బులు పంచుతోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌ స్పందిస్తూ గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ కార్మికులు యూనియన్‌లు పెట్టుకోవద్దని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. హుజూర్‌ నగర్‌ ఎన్నికల తర్వాత యూరేనియంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. యూరేనియం తవ్వకాలపై కేసీఆర్‌ తీరు మారలేదన్నారు. యూరేనియం తవ్వకాలపై సర్వేచేస్తున్న అధికారులెవరూ కృష్ణానదిలో చేపలు తినడం లేదని ఈసందర్భంగా వీహెచ్‌ వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *