Breaking News
Home / Politics / ఆయన దొరల పాలన సాగిస్తున్నారు…

ఆయన దొరల పాలన సాగిస్తున్నారు…

హైదరాబాద్ : ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తున్నారంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై ఆనాడు కేసీఆర్ తీవ్ర  విమర్శలు చేశారు. మరి ఇవాళ ఆయన ఏం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్‌పై 27 శాతం మేరకు ఉన్న వ్యాట్‌ను ఎందుకు తగ్గించడంలేదని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్య ఉద్యోగులకు సంఘాలున్నాయని, మరి కార్మికులకు మాత్రం ఎందుకు ఉండకూడదని హన్మంతరావు ప్రశ్నించారు. కేసీఆర్ దొరల పాలన సాగిస్తున్నారన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నా ఇప్పటికి జీతాలు చెల్లించలేదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఇప్పటి వరకు ఐదుగురు మరణించారని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *