Breaking News
Home / States / కేసీఆర్, గవర్నర్‌పై వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్, గవర్నర్‌పై వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్‌ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్‌ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. ఇక అధికార అహంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హాజీపూర్ సమస్యను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస జ్ఞానంలేదని ధ్వజమెత్తారు. బస్సు సౌకర్యం, వంతెన నిర్మించడంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Check Also

తండ్రి చనిపోయినా మనోధైర్యంతో…

Share this on WhatsAppచదువులో ప్రతిభ చాటిన యువకుడు 2018 సీఏ ఫలితాల్లో 20వ ర్యాంకు ఐసీఎస్‌‌ఐలో ట్యాక్స్‌మాన్స్‌ ప్రైజ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *