Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బాధితురాలి ఆత్మ శాంతించింది : వాసిరెడ్డి పద్మ

బాధితురాలి ఆత్మ శాంతించింది : వాసిరెడ్డి పద్మ

అమరావతి : దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో వైఎస్సార్‌ హయాంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న పాశవిక దాడులకు ప్రతిగా ఈ ఎన్‌కౌంటర్‌ కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. నిందితులకు పడిన శిక్ష పట్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాల్లో మార్పు రావాలని వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *