Breaking News
Home / National / సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో…

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో…

ఖుర్దా: ఒడిశాలోని ఖుర్దా జిల్లా బన్‌పూర్‌లో ఓ పూజారి ఆలయానికి వచ్చిన భక్తులను ఆశీర్వదించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భక్తుల తలపై కాలు పెట్టి ఆశీస్సులు అందించారు. విజయదశమి రోజున జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాహన పూజలు చేయించుకున్న కొందరు భక్తులు ఇలా పూజారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ ఘటనపై కొందరు పూజారి చర్యలను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించడం వంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సదరు పూజారి తన చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారమని, సంప్రదాయాలు తెలియని వ్యక్తులు ఈ దృశ్యాలను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *