Breaking News
Home / Film News / కథా రచయితగా విజయ్ దేవరకొండ

కథా రచయితగా విజయ్ దేవరకొండ

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేష్ నాయికలుగా కనిపించనున్నారు. ఈ వారమంతా జరిగే చిత్రీకరణతో షూటింగు పార్టు పూర్తికానుంది. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో ఆయన కథా రచయితగా కనిపిస్తాడట. ఆయన రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయట. ఇలా ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందని అంటున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *