Breaking News
Home / Film News / బిగ్ బాస్ ఇంట్లో విజయ్ హంగామా…

బిగ్ బాస్ ఇంట్లో విజయ్ హంగామా…

టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ 3 ఈరోజు ఎపిసోడ్ కు అతిథిగా వచ్చాడు. బిగ్ బాస్-3 దీపావళి ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, విజయ్ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి కంటెస్టెంట్లతో హంగామా చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో కొంటెగా సమాధానమిచ్చాడు.

“నీ పెళ్లి గురించి ప్రతి ఆర్నెల్లకోసారి ఏదో ఒక రూమర్ వస్తోంది విజయ్” అని నాగ్ అడగ్గా, “నా అమల ఎక్కడుందో వెతుక్కుంటున్నా” అంటూ విజయ్ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. దాంతో నాగార్జున స్పందిస్తూ, “నీ అమల నీకు త్వరగా దొరకాలని ఆశీర్వదిస్తున్నా”నంటూ కామెంట్ చేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *