Breaking News
Home / Film News / మహిళలకు అంకితమిచ్చిన విజయ్ మూవీ….

మహిళలకు అంకితమిచ్చిన విజయ్ మూవీ….

ఫిల్మ్ న్యూస్: కోలీవుడ్ స్టార్ విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `బిగిల్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు `విజిల్‌` అనే పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులో 700 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో విజయ్ హీరో అయినా మహిళల ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంలో సినిమా సాగుతుంది. అసలు `విజిల్‌`కథను రాయడానికి కారణం ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులే కారణమని అట్లీ తెలిపారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి బాధతో `విజిల్‌` కథను రాసుకున్నానని అట్లీ తెలిపారు. మహిళా ప్రధానంగా సాగే సినిమాలో విజయ్‌లాంటి సూపర్‌స్టార్ నటించడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పిన అట్లీ `విజిల్‌` సినిమాను మహిళలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *