అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్లో విమర్శించారు. ”అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టాడు. ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు అని విమర్శించాడు.
1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరు. ‘దొంగే దొంగ అని అరవడం’ చంద్రబాబుకు 40 ఏళ్లుగా అలవాటే అని విమర్శించారు. వైసీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించింది ఆయనే అని అన్నారు. ఇవ్వాళ తనే బాధితుడినన్నట్టు కుల మీడియాలో శోకాలు పెడుతున్నాడు. తన వరకు వస్తే తప్ప బాధేమిటో తెలియలేదు సారుకి” అని విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.