Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు….

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు….

అమరావతి : సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లు మొదట ఉంటాయంటూ చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ మీ పుత్రరత్నం పెట్టిన ట్వీట్లు సుమతి శతకాల్లా కనిపిస్తున్నాయా బాబూ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘సోషల్ మీడియా వాల్స్‌పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పోస్ట్ చేస్తారు. అనాగరిక దూషణలుంటే ఫేస్‌బుక్‌కి ఫిర్యాదు చేయొచ్చు. చంద్ర’జ్యోతి’ ఎన్ని మంటలు రాజేయాలని చూసినా లాభం లేకుండా పోయిందనేదే సార్ అసలు బాధ’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

అదే విధంగా.. సీఎం జగన్‌పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి.. 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘మీ బానిస పత్రికలు, ఛానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా మీ అరాచకాలన్నిటినీ బయట పెట్టింది. అందుకేనా ఈ ఏడుపు’ అంటూ ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. ‘అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని రాయించినా సీఎం జగన్‌ స్పందించక పోవడంతో ఆయనలో నిస్పృహ కట్టలు తెంచుకుంది’ అని ట్విటర్‌ వేదికగా చంద్రబాబు తీరును విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *