Breaking News
Home / Film News / ఈ నెల15 న విజయ్ సేతుపతి విడుదల….

ఈ నెల15 న విజయ్ సేతుపతి విడుదల….

కోడంబాక్కం: విజయ్‌చందర్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘విజయ్‌సేతుపతి’. రాశీఖన్నా, నివేదా పెత్తురాజ్‌లు కథానాయికలు. విజయా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై భారతిరెడ్డి దీనిని నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బిగిల్‌, ఖైదీ చిత్రాలు బరిలో ఉండడం, ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇందులో విజయ్‌ సేతుపతి పోలీసు అధికారిగా నటిస్తున్నారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ చిత్రంగా దీన్ని రూపొందించినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ జనాల్లో మరింత క్రేజీ సంపాదించుకోవాలని విజయ్‌ సేతుపతి భావిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *