Breaking News
Home / Film News / ‘విజయ్ దేవరకొండ’ పేరు మారింది

‘విజయ్ దేవరకొండ’ పేరు మారింది

నటుడు విజయ్ దేవరకొండ తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్‌`. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటి వరకు తన స్క్రీన్ నేమ్‌ను విజయ్ దేవరకొండ అని వేసుకుంటూ వచ్చిన ఈ యంగ్ హీరో తాజాగా విడుదలకు సిద్ధమవుతోన్న `వరల్డ్ ఫేమస్ లవర్‌` సినిమాకు స్క్రీన్ నేమ్ మార్చుకున్నాడట. ఈ సినిమా నుండి స్క్రీన్ నేమ్ దేవరకొండ విజయ్ సాయిగా మారింది. టీజర్‌తో ఆ విషయం చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ మధ్య విడుదలైన నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. దీంతో న్యూమరాలజీ ప్రకారం ఏమైనా పేరు మార్చుకున్నాడని టాక్‌. మరి ఈ పేరు మార్పు ఆయన సక్సెస్‌కు ఏ మేరకు దోహద పడుతుందో.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *