Breaking News
Home / States / Andhra Pradesh / అధికార పార్టీ నేత ” నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.” : మాజీ స్పీకర్

అధికార పార్టీ నేత ” నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.” : మాజీ స్పీకర్

సత్తెనపల్లి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే తన కుటుంబసభ్యులపై కేసులు బనాయిస్తున్నారని మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. సోమవారం సత్తెనపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను తన కుటుంబాన్ని బద్నాం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కక్ష్య సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదని, అవాస్తవాలతో వేధిస్తున్నారని తెలిపారు. కేసుల వాస్తవ, అవాస్తవాలపై సిట్‌ విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ కార్యకర్తలను కూడా వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన జరగాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. తాను 37 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని, 17 ఏళ్లు బాధ్య తాయుతమైన పదవులు నిర్వహించానన్నారు. ఏనాడు అధికార దుర్వినియోగం చేయటం కోసం పదవులను అడ్డం పెట్టుకోలేదన్నారు. ఓట్ల కోసం ఏనాడు రాజకీయాలు చేయలేదన్నారు. భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. సత్తెనపల్లిలో 20 వేల మెజార్టీతో ఓటమి చెందిన విషయంపై నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాజకీయంగా సత్తెనపల్లిలోనే పని చేస్తానన్నారు సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ యెల్లినేడి రామస్వామి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు ఉన్నారని తెలిపారు.

Check Also

దక్షణాది రాజకీయాలు మారబోతున్నాయి…

Share this on WhatsAppహైదరాబాద్: తెలంగాణలో అధికారానికి బీజేపీ దగ్గరగా ఉందని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *