విజయవాడ: ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే కొండపైకి చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా శనివారం బెజవాడ దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులను కటాక్షించింది. శనివారం మూలానక్షత్రం.. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మూడు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించారు.