విజయవాడ: బెజవాడ కాళేశ్వరరావు మార్కెట్లో గురువారం కనిపించిన రద్దీ ఇది. ఇలాగే వదిలేస్తే చెన్నైలోని కోయంబేడు మార్కెట్లా కరోనాకు హాట్‌స్పాట్‌గా మారే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లాలో నమోదవుతున్న కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో అత్యధికం విజయవాడలోనివే. అయినా.. ఇక్కడి మార్కెట్లో ప్రజల మధ్య భౌతికదూరం కనిపించడం లేదు. కొందరికి మాస్కులూ ఉండటం లేదు. దుకాణాల వద్ద నిల్చోవడానికీ వీల్లేనంతగా రద్దీ ఉంటోంది. ‘ఈ పరిస్థితుల్లోనూ విధిలేక రాకతప్పడం లేద’ని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
