Breaking News
Home / World / వైరల్‌: హోటల్‌లో దూరిన గజరాజు!

వైరల్‌: హోటల్‌లో దూరిన గజరాజు!

హోటల్‌ లాబీలోకి ఏనుగు ప్రవేశించిన వీడియో సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. శ్రీలంకలో చోటుచేసుకున్న ఈ ఘటనపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ” మా అమ్మ మెసేజ్‌తో నిద్రలేచాను. శ్రీలంక హోటల్‌లోకి ప్రవేశించిన ఓ ఏనుగు తన తొండంతో అక్కడున్న వస్తువులను తడిమిచూడటం గురించి తెలుసుకున్నాను” అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఏనుగు వీడియో ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది.

ఈ క్రమంలో… ‘గజరాజు ఏం చేసినా భలే ముద్దుగా ఉంటుంది. చూశారా.. ఏనుగు ఎంత మర్యాదగా హోటల్‌లోకి వెళ్లి అన్నీ పరీక్షిస్తుందో!!”అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై స్పందించిన మరో నెటిజన్‌….ఆ ఏనుగు పేరు నట్టా కోటా అని… శ్రీలంకలో ఉన్న జెట్‌వింగ్‌ యాలా హోటల్‌కి తరచుగా వెళ్తూ ఉంటుందని పేర్కొన్నారు. ఏనుగుకు సంబంధించిన మరిన్ని వీడియోలు యూట్యూబ్‌లో చూడవచ్చని తెలిపారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *