Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి…

విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి…

విశాఖపట్నం: జిల్లాలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి మొదటిరోజు నిరాశ ఎదురైంది. శ్రద్దా ఆసుపత్రి యాజమాన్య పెద్దలు మాయంపై త్రిసభ్య కమిటీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. త్రిసభ్య కమిటీ శ్రద్దా ఆసుపత్రిలో మొదటిరోజు గంటసేపు చేసిన విచారణలో యాజమాన్య పెద్దలు లేకపోవడంతో రిసెప్షన్‌లో అడిగి కమిటీ సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. శ్రద్దా ఆసుపత్రి ఎండీ పరారీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో అధికారులతో మంతనాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. కిడ్నీ రాకెట్‌లో పాత్రదారులు అయితే.. సూత్రధారి మాత్రం ఇదే ఆసుపత్రిలో క్రిటికల్ కేర్‌లో ఎనస్తీషియా వైద్యుడుగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పాత్రదారులు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ జేకే వర్మలుగా త్రిసభ్య కమిటీ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

చిత్తూరులో నిరసనకు దిగిన టీడీపీ అభ్యర్థి

Share this on WhatsAppచిత్తూరు: జిల్లాలోని పులివర్తి వారి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *