Breaking News
Home / States / Andhra Pradesh / విశాట్‌ 2020 నోటిఫికేషన్‌ విడుదల

విశాట్‌ 2020 నోటిఫికేషన్‌ విడుదల

గుంటూరు: బీటెక్‌, బీఫార్మశీల్లో ప్రవేశం కోసం విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే విశాట్‌-2020 నోటిఫికేషన్‌ గురువారం విడుదల చేశారు. వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ విశాట్‌ వివరాలను గుంటూరులో విలేకరులకు వివరించారు. విజ్ఞాన్‌ వర్సిటీలో ప్రవేశం కోసం 2020-21 సంవత్సరానికిగాను విశాట్‌ను ఏప్రిల్‌ 14 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్‌ 5 చివరి తేదీ అని పేర్కొన్నారు. గుంటూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖ, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లోని విజ్ఞాన్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షను రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.4కోట్ల వరకు ఫీజు రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. కోర్సులు, అడ్మిషన్‌ ఇతర వివరాల కోసం https://vignan.ac.in/

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *