ఫిల్మ్ న్యూస్: అజిత్ హీరోగా శివ దర్శకత్వం, డి.ఇమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వాసం’లో మ్యూజిక్ ట్రాక్‌ను తాజాగా విడుదలైన హిందీ సినిమా ‘మార్జావాన్’ ట్రైలర్లో ఉపయోగించడం వివాదంగా మారింది. సంగీత దర్శకుడు డి.ఇమాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇమాన్ ట్విట్టర్లో ఒక సందేశం పోస్టు చేస్తూ, ‘మార్జావాన్ హిందీ సినిమాలో ‘విశ్వాసం’ సినిమాలోని నేపథ్య సంగీతాన్ని ఉపయోగించడం గురించి నాకు తెలీదు. ఆడియో కంపెనీ నుంచి గానీ, నిర్మాణ సంస్థ నుంచి గానీ నాకు ఎటువంటి సమాచారం లేదు’ అని పేర్కొన్నారు. అయితే ‘మార్జావాన్’ ట్రైలర్లో నేపథ్య సంగీతం టైటిల్ కార్డులో సంజయ్ చౌదరి, లహరి మ్యూజిక్ పేర్లతో పాటు డి.ఇమాన్ పేరు కూడా వేశారు.
