Breaking News
Home / Film News / వివాదంలో `విజిల్‌`

వివాదంలో `విజిల్‌`

విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం `విజిల్‌`. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రం అక్టోబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. విడుద‌ల‌కు ఓ వారం ఉంద‌న‌గా ఈ సినిమాపై కొత్త వివాదం రేగింది. షార్ట్ ఫిలిమ్ డైరెక్ట‌ర్ నంది చిన్ని కుమార్ త‌న సినిమా `స్ల‌మ్ సాక‌ర్‌` సినిమా మెయిన్ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని `విజిల్ చిత్రాన్ని డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించారని ఈయ‌న పేర్కొన్నారు. `విజిల్‌` చిత్ర బృందంపై చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలంగాణ సినిమా ర‌చ‌యిత‌ల సంఘాన్ని కోరారు. ఈ మేర‌కు పిటిష‌న్‌ను కూడా వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సినీ ర‌చ‌యిత‌ల సంఘం రెండు క‌థ‌ల‌ను ప‌రిశీలించి వివాదంపై స్పందించ‌నుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *