అమరావతి: ఏపీ సచివాలయంలోకి వెళ్లాంటే ప్రధాన ద్వారం వద్ద గ్రీవెన్స్ హాల్ ఉంది. అక్కడ వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే ఆ హాల్ల్లోకి ప్రవేశం కల్పిస్తారు. అప్పటివరకు సందర్శకులు ఎండకు ఎండుతూ… వానకు తడుస్తూ గేటు బయటే క్యూలో నిలబడాల్సి ఉంటుంది. గేటు బయట కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకుల ఇక్కట్లు పడుతున్నారు.
