Breaking News
Home / States / Andhra Pradesh / వివేకా హత్య కేసు: ఆయన వెనకున్న పెద్దలు ఎవరు..!?

వివేకా హత్య కేసు: ఆయన వెనకున్న పెద్దలు ఎవరు..!?

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొద్దుటూరు సునీల్‌ గ్యాంగ్‌తో శ్రీనివాస్‌రెడ్డికి సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌రెడ్డి వెనక ఉన్న పెద్దలు ఎవరన్న విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. వివేకా హత్య కేసు, సునీల్‌ గ్యాంగ్‌తో శ్రీనివాస్‌‌కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

కాగా.. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా.. ఆయన మరణంతో అనుమానాలు పెరిగిన విషయం విదితమే. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేయగా.. సంచలన నిజాలు వెలుగుచూశాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చిలో వైఎస్ వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *