Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో మళ్లీ విషవాయువు కలకలం

విశాఖలో మళ్లీ విషవాయువు కలకలం

విశాఖ: ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో విషవాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్ రాగి నాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కె మీనా పరిశీలించారు. మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు కంపెనీ ప్రతినిధులు తరలించారు. ప్రమాదం రాత్రి 11:30 కు జరిగితే కంపెనీ సిబ్బంది మూడు గంటల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *