Breaking News
Home / National / పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు : ఆజాద్

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు : ఆజాద్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)ను ప్రభుత్వం రాజ్యసభలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దీనిపై చర్చకు ముందే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించింది. బీజేపీకి కేవలం మతప్రాతిపదికన విభజించడంపైనే ఆసక్తి అని విమర్శించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో భావసారూప్యం కలిగిన 13 పార్టీలు ఉన్నాయని, వారిని స్వయంగా తాను కలిసానని, వారంతా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని చెప్పారు.

దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, చుక్కలనంటుతున్న ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపూ లేదని, కేవలం మత ప్రాతిపదికపై దేశ విభజనపైనే బీజేపీకి ఆసక్తి అని ఆయన విమర్శించారు. 370 అధికరణ రద్దు, ట్రిపుల్ తలాక్ వంటివి ఇందుకు ఉదాహరణలని ఆయన అన్నారు. రాజ్యాంగంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదనే విషయం ఆయా సందర్భాల్లో రుజువైందన్నారు.

బలమెంత?
కాంగ్రెస్‌కు రాజ్యసభలో 64 మంది సభ్యుల బలం ఉండగా, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీఆర్ఎస్, సీపీఎం సహా పలు పార్టీలకు చెందిన 46 మంది బిల్లును వ్యతిరేకంగా ఓటు వేస్తారని, దీంతో బిల్లును వ్యతిరేకించే వారి బలం 110కి పైగా ఉంటుందని కాంగ్రెస్ అంచనాగా ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *