Breaking News
Home / National / ర్యాంప్ వాక్ చేస్తూ.. స్టూడెంట్ మృతి…

ర్యాంప్ వాక్ చేస్తూ.. స్టూడెంట్ మృతి…

బెంగుళూరు: బెంగుళూరులోని ఓ కాలేజీలో ప్రెషర్స్ డే కోసం విద్యార్ధినులు ర్యాంప్‌పై క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ విద్యార్ధిని గుండెపోటుతో మృతి చెందింది. క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తూ… ఉన్నపాటుగా ఆమెకు కళ్లు తిరగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో షాలినిని హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. షాలిని గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు వెల్లడిస్తుండగా.. ఇంత చిన్నవయసులో తమ కుమార్తెకు గుండెపోటు ఎలా వస్తుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. షాలిని మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *