Breaking News
Home / States / Andhra Pradesh / వార్డు వాలంటీర్‌కి కత్తిపోట్లు…

వార్డు వాలంటీర్‌కి కత్తిపోట్లు…

విశాఖ:విశాఖలోని మధురవాడ కె-1 కాలనీలో వార్డు వాలంటీర్‌గా లాల్ బహుదూరాయ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం వైట్ కార్డును పలు రకాలుగా డివైడ్ చేేస్తోన్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం.. గ్రామ, వార్డు వాలంటీర్ల నుంచి డేటాను సేకరించింది. నవంబర్ 20 వ తేదీ నుంచి 30 వరకు ఈ సర్వే జరిగింది.అయితే ఈ సర్వే చేసేటప్పుడు వాలంటీర్ తన దగ్గర నుంచి డేటా తీసుకోలేదన్న నెపంతో , వార్డులోని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. రెండుసార్లు కడుపులో పొడవడటంతో అతను అక్కడికక్కడే కూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు వెంటనే అతడిని కేజీహెచ్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *