Breaking News
Home / States / హీటర్‌తో ప్లాస్టిక్‌ బకెట్‌లో నీరు వేడి చేస్తుండగా అగ్ని ప్రమాదం

హీటర్‌తో ప్లాస్టిక్‌ బకెట్‌లో నీరు వేడి చేస్తుండగా అగ్ని ప్రమాదం

కాలిపోయిన గృహోపకరణాలు
బాధితులను పరామర్శించిన
మాజీ మంత్రి నాయిని, ఎమ్మెల్యే గోపాల్‌
ముషీరాబాద్‌/హైదరాబాద్: రాంనగర్‌ దాయార మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హీటర్‌తో ప్లాస్టిక్‌ బకెట్‌లో నీరు వేడిచేస్తుండగా మంటలు చెలరేగి ఇంట్లోని గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. దాయార మార్కెట్‌ సమీపంలోని బాకారంలోగల 1-7- 432/1/1 నంబర్‌గల ఇంట్లో హేమంత్‌ కుటుంబ సభ్యులతో అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య శ్రీదేవి, కుమార్తెలు గీత హంసిని(4), అశ్విని(2)ఉన్నారు. హేమంత్‌ చిక్కడపల్లిలో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం శ్రీదేవి హీటర్‌తో ప్లాస్టిక్‌ బకెట్‌లో నీరు వేడి చేస్తున్నారు. నీరు బాగా కాగడంతోపాటు హీటర్‌ బకెట్‌కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. అందరూ నిద్రపోతుండడంతో మంటలను ఎవరూ గమనించలేదు. స్విచ్‌బాక్స్‌కు అంటుకొని గృహోపకరణాలు, ఫర్నిచర్‌ కాలిబూడిదయ్యాయి.

దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయిన కుటుంబసభ్యులు వెంటనే లేచి బయటకు పరుగు తీశారు. స్థానికులు గమనించి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అస్వస్థతకు గురైన హేమంత్‌, అతడి పిల్లలను 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు వి.శ్రీనివా్‌సరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ముచ్చకూర్తి ప్రభాకర్‌, అక్బర్‌ ఆలీ, బీజేపీ రాంనగర్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌, ముషీరాబాద్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌, ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని నాయిని నర్సింహారెడ్డి, ముఠా గోపాల్‌, వి.శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.

Check Also

పిల్లలను అపహరిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

Share this on WhatsAppహైదరాబాద్: పిల్లల్ని అపహరించి.. డబ్బుల్లేని వారికి పిల్లలను అమ్మడం.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం.. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *