Breaking News
Home / Health / గింజలు పారేశారో…. తరువాత గింజుకోవల్సిందే!

గింజలు పారేశారో…. తరువాత గింజుకోవల్సిందే!

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుచ్చకాయలు విరివిగా కనిపిస్తున్నాయి. ఈ పుచ్చకాయ తినేటప్పుడు గింజలు తినవద్దని చాలామంది చెబుతుంటారు. అయితే పుచ్చకాయ గింజలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీకు తెలుసా? అవును… పుచ్చకాయ గింజలను చక్కగా నమిలి తినడం వలన ఎన్నోప్రయోజనాలున్నాయి. ఈ గింజల్లో మెగ్నీషియం పాళ్లు అధికంగా ఉంటాయి. ఇది హృదయ ఆరోగ్యానికి సహకరిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణం చర్మానికి మేలు చేస్తుంది. పుచ్చ గింజలను ఉడికించి ఆ సిరప్‌ను రోజూ తీసుకోవడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.

Check Also

తుఫాను హెచ్చరిక చిహ్నాలు ..వాటి అర్థాలు

Share this on WhatsAppచెన్నై: తుఫాను ప్రభావాన్ని సూచిస్తూ హార్బర్లలో హెచ్చరికలు జారీ చేయడం గురించి అందరికీ విదితమే. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *