Breaking News
Home / States / ఎస్సారెస్పీ వరద కాలువకు నీటి విడుదల…

ఎస్సారెస్పీ వరద కాలువకు నీటి విడుదల…

హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గిపోవడంతో ప్రధాన గేట్లను మూసినట్లు తెలిపారు. వరద కాలువ ద్వారా వదిలిన నీరు కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టుకు చేరుతాయన్నారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎమ్‌డీ ప్రాజెక్టుకు విడుదల చేస్తారని తెలిపారు. ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి  10,320 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగిందన్నారు. దీంతో వరద కాలువకు 3వేలు, కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్కేప్ గేట్లకు నీటి విడుదలను నిలిపివేసినట్లు ఏఈఈ తెలిపారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *