Breaking News
Home / National / వాట్సన్ రియల్ హీరో! రక్తమోడుతున్నా బ్యాటింగ్

వాట్సన్ రియల్ హీరో! రక్తమోడుతున్నా బ్యాటింగ్

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌ ఆఖరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒక్క పరుగు తేడాతో ఓడి నా ఆ టీమ్‌ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ జట్టును గెలిపించడానికి ఎంతగా పోరాడాడనేది ఆలస్యంగా వెలుగు చూసింది. రక్తమోడుతున్నా.. ఎవరికీ చెప్పకుండానే బ్యాటింగ్‌ కొనసాగించాడు. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండడంతో ఎవరూ దీనిని గమనించలేక పోయారు. మధ్య ఓవర్లలో డైవ్‌ చేసే క్రమంలో వాట్సన్‌ మోకాలి వద్ద గాయమైంది. ఈ విషయాన్ని చెన్నై ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. వాట్సన్‌ ఎడమ మోకాలి వద్ద రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. ‘అతడి మోకాలి వద్ద కారుతున్న రక్తాన్ని చూశారా? మ్యాచ్‌ తర్వాత వాట్సన్‌కు ఆరు కుట్లు పడ్డాయి. డైవింగ్‌ చేసినప్పుడు గాయపడినా.. ఎవరికీ చెప్పకుండా అతడు బ్యాటింగ్‌ను కొనసాగించాడ’ని భజ్జీ రాసుకొచ్చాడు. ఈ ఐపీఎల్ ఫైనల్‌లో వాట్సనే రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *