Breaking News
Home / States / ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము….

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము….

హైదరాబాద్: వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ తెలిపారు. వర్షాల వల్ల పాడైన రహదారులకు మరమ్మతులు చేస్తున్నాం. నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో ఇప్పటి వరకు 1043 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్‌పై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం రావాలి. బతుకమ్మ నిమజ్జనం కోసం కొలనులు సిద్ధం చేస్తున్నాం. బతుకమ్మ ఆఖరి రోజు ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మల ఊరేగింపు ఉంటుంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీకి నిధుల కొరత లేదని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *