Breaking News
Home / States / Andhra Pradesh / ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము…

ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము…

విజయవాడ: శ్రీ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి అలంకారంలోఉన్న దుర్గమ్మను 1 లక్షా 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారని దుర్గగుడి ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం 53750, పులిహోర 33330 టిక్కెట్లు విక్రయించినట్టు తెలిపారు. గత సంవత్సరం మీద ఈ ఏడాది మొదటి రోజు అమ్మవారి అదాయం పెరిగిందని సురేష్ బాబు స్పష్టం చేశారు. 300 రూపాయల టికెట్ ఉంటేనే భక్తులను ఆ మార్గం ద్వారా అనుమతిస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీల పేరుతో వచ్చే వారికి చెక్ పెట్టే చర్యలు చేపడుతున్నామన్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *