Breaking News
Home / Sports / మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాం: టీమిండియాపై ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు

మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాం: టీమిండియాపై ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు

ఆస్ట్రేలియా గడ్డ‌పై 72 ఏళ్ల‌లో తొలి టెస్ట్ సిరీస్ విజ‌యాన్ని న‌మోదు చేసి కోహ్లీ సేన చ‌రిత్ర సృష్టించింది. 2-1తో చారిత్ర‌క విజ‌యాన్ని అందుకుంది. భారత క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న విజ‌యాన్ని అంద‌జేసినందుకు టీమిండియాపై సోష‌ల్ మీడియాలో ప్రశంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఎంతో మంది ప్ర‌ముఖులు టీమిండియాకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతోపాటు క్రీడా ప్ర‌ముఖులు కూడా టీమిండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజ‌యం అందించిన‌ కోహ్లీ సేన‌కు అభినంద‌న‌లు. మీ ప్ర‌తిభ మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేసింది. ఇదే ప్ర‌ద‌ర్శ‌న‌ను కొనసాగించండి. – రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌

ఆస్ట్రేలియాలో చారిత్ర‌క విజ‌యం. క‌ఠోర శ్ర‌మ‌, పోరాటంతో విజ‌యం సాధించిన టీమిండియాకు అభినంద‌న‌లు. స‌మ‌ష్టి కృషి, ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌లకు ఈ సిరీస్ సాక్ష్యంగా నిలిచింది. ఇక ముందు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలి.

– ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

చిరస్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించినందుకు కోహ్లీ సేనకు అభినంద‌న‌లు. మీరు భార‌త్‌లోని ప్ర‌తి క్రికెట్ ప్రేమికుణ్నీ గ‌ర్వ‌ప‌డేలా చేశారు. స‌మ‌ష్టి కృషి కార‌ణంగానే ఈ విజ‌యం సాధ్య‌మైంది. – సెహ్వాగ్‌

మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాం. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది. సిరీస్ ఆసాంతం రాణించిన పుజారాకు అభినంద‌న‌లు. బుమ్రా బౌలింగ్ అద్భుతం. – హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

వ‌చ్చారు. గెలిచారు. ఆస్ట్రేలియాలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. జ‌ట్టులోని స‌భ్యుల‌కు, కోచింగ్ సిబ్బందికి అభినంద‌న‌లు. – అనుష్క శ‌ర్మ

ఈ చారిత్ర‌క విజ‌యంతో ప్ర‌తీ భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడు: – కైఫ్‌

Check Also

బ్రేకింగ్ న్యూస్: రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రిస్ గేల్

Share this on WhatsAppస్పోర్ట్స్: వెస్టిండీస్ విధ్వసంకర ఆటగాడు క్రిస్ గేల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *