Breaking News
Home / States / Andhra Pradesh / సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాము….

సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాము….

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇసుక రుచి బాగా తెలిసినట్లుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్మాణ రంగాన్ని నష్టాల్లోకి తీసుకెళ్తుందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. యురేనియం వెలికితీసే పరిశ్రమలకు వ్యతిరేకంగా అన్నిపార్టీలను కలుపుకొంటూ ఆందోళన చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఏపీ గ్రామసచివాలయ ఉద్యోగాల్లో మూడేళ్ల నిబంధన ఉపసంహరించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ నెల 13న విజయవాడలో సీపీఐ రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమస్యలపై ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సీఎం జగన్‌ స్పందించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *