Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వారి రక్షణ కోసం యాప్ రూపొందించాము…

వారి రక్షణ కోసం యాప్ రూపొందించాము…

అమరావతి: రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా రక్షణ కోసం యాప్‌ రూపొందించామని హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ హెల్ప్‌లైన్‌ నెంబర్ల ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. మహిళల్లో అవగాహన విశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళల కోసం సైబర్‌ మిత్రా ఏర్పాటు చేశామని, 9121211100 సైబర్‌ మిత్రా వాట్సాప్‌ నెంబర్ జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు డీజీపీ ఆదేశాలిచ్చారని మంత్రి పేర్కొన్నారు. పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేశామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *