అమరావతి: తాడేపల్లి మున్సిపాలిటీని ప్రభుత్వం గ్రేడ్-1గా మార్చింది. మున్సిపాలిటీల చట్టం 1965 సెక్షన్-22 ప్రకారం గ్రేడ్-1గా మార్పు చేస్తూ పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి, మంగళగిరిని మోడల్ మున్సిపాలిటీలు చేస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటించారు.
