Breaking News
Home / States / వారు ఇబ్బందుల్లో ఉంటే మా పార్టీ ఊరుకోదు…

వారు ఇబ్బందుల్లో ఉంటే మా పార్టీ ఊరుకోదు…

హైదరాబాద్: సీపీఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతిస్తోందని తెలిపారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సర్కారుకు మద్దతు అనేది రాజకీయ నిర్ణయమని, దానిని ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ముడిపెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. నేడు ఆర్టీసీ సంక్షోభంలో ఉందని కేసీఆర్ తాజా వ్యాఖ్యలను చూస్తే అర్థమౌతోందని, సీఎం మొండి వైఖరి వీడి, నిబద్ధతతో ఆలోచించాలని ఆయన కోరారు.

పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టే ఇక్కడి కార్మికులకు కొంత ఆవేదన ఉంటుందని తెలిపారు. కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే తమ పార్టీ ఊరుకోదని, ఉద్యోగ సంఘ నాయకులను, ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *