Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మేం చేసినంత సంక్షేమం కేసీఆర్ చేశారా: చంద్రబాబు

మేం చేసినంత సంక్షేమం కేసీఆర్ చేశారా: చంద్రబాబు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. తమ ప్రభుత్వం చేసినన్నీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని అన్నారు. ‘‘ఒకే రోజు రెండు పెద్ద సంస్థలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ధనిక రాష్ట్రాలు కూడా చేయనన్ని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో చేశాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఇక అమరావతి అంటే.. ఒక నమ్మకం.. ఒక విశ్వాసం అని చంద్రబాబు తెలిపారు. ‘‘రక్ష కార్యక్రమం కింద బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్లు అందిస్తున్నాం. ఒక నమ్మకం.. ఒక విశ్వాసం.. అదీ అమరావతి. ప్రజారాజధాని అమరావతిని చేపట్టడం మనం సాధించిన విజయం. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తుండటం మన విజయం. మోదీ నాయకత్వాన్ని దేశమంతా ఛీ కొడుతుంటే.. మన ప్రతిపక్ష నాయకుడు ఆయన పక్కన చేరాడు’’ అని చంద్రబాబు తెలిపారు.

Check Also

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Share this on WhatsAppఅమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *